జనసైనికులు వారి సూచనలు నేరుగా పార్టీ కార్యాలయానికి అధినేతకు నేరుగా విన్నవించేలా పార్టీ నిర్మాణం
జనసైనికులు వారి సూచనలు నేరుగా పార్టీ కార్యాలయానికి అధినేతకు నేరుగా విన్నవించేలా పార్టీ నిర్మాణం

జనసైనికులు పార్టీ బలోపేతం కోసం ఎంతో శ్రమిస్తూ, పార్టీ నిర్మాణంలో పాలుపంచుకుంటున్న ప్రతి ఒక్కరూ కూడా గత ఎన్నికల ఫలితాలతో కొంతవరకు నిరాశ చెందారు. అయినప్పటికీ వారు జరిగిన తప్పు ఒప్పులను సరిదిద్దుకుని నూతన ఉత్తేజంతో పార్టీ కోసం పనిచేసేందుకు ముందుకు వస్తున్నారు.
వివిధ వర్గాల నుంచి వచ్చిన సలహాలు, సూచనలతో పార్టీ నిర్మాణంలో వేగవంతంగా ముందుకు వెళ్తుంది. అలాగే జనసైనికులు వారి సూచనలు నేరుగా పార్టీ కార్యాలయానికి, నాయకులకు, అధినేతకు నేరుగా విన్నవించేలా పార్టీ నిర్మాణం కూడా వేగవంతంగా కొనసాగుతుంది
కాబట్టి జనసైనికులు ఎటువంటి నిరాశకు లోనుకాకుండా మరింత బాధ్యతతో పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లి రానున్న ఎన్నికల్లో బలంగా సత్తా చాటేలా కృషి చేద్దాం.