Janasena Protest :-ఆస్తి,చెత్త పన్నులుపెంపు G.O 196,197,198లను రద్దు చేయాలి
Janasena Protest :-ఆస్తి,చెత్త పన్నులుపెంపు G.O 196,197,198లను రద్దు చేయాలి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం జారీచేసిన ఆస్తి,చెత్త పన్నులుపెంపు G.O 196,197,198లను రద్దు చేయాలి విశాఖ జీవీఎంసీ కౌన్సిల్ మీటింగ్ లొ వైసిపి పార్టీ పన్నులపెంపు నిర్ణయానికి వ్యతిరేకంగా విశాఖ జనసేనపార్టీ ఆధ్వర్యంలో నిరసన తెలియజేసిన కార్పొరేటర్లు, వీరమహిళలు జననేతలు,జనసైనికులు
పురపాలక పరిపాలన మరియు పట్టణాభివృద్ధి శాఖ జారీ చేసిన GO Ms.No 198 ఆస్తి పన్ను వ్యవస్థను వార్షిక అద్దె విలువ నుండి మూలధనానికి మార్చింది, పాత నిర్మాణంతో పోలిస్తే, ఆస్తి పన్నులో 10 నుండి 15 శాతం పెరుగుదల ఉంటుంది,కొత్తగా సవరించిన పన్ను నిర్మాణం అని జనసేనపార్టీ కార్పొరేటర్లు అన్నారు.
నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని వారు మున్సిపల్ కమిషనర్‌కు ఒక మెమోరాండం సమర్పించారు. మున్సిపల్ చట్టాలకు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల చేసిన సవరణలను ఉపసంహరించుకోవాలని మరియు పన్నులు విధించే మునుపటి విధానాన్ని పునరుద్ధరించాలని విశాఖ జనసేనపార్టీ ఆధ్వర్యంలో నిరసన తెలియజేసిన కార్పొరేటర్లు, వీరమహిళలు జననేతలు,జనసైనికులు డిమాండ్ చేశారు.
