Pawan Kalyan donates Rs 2 lakh to Kinnera artist Shri Mogulayya

Pawan Kalyan donates Rs 2 lakh to Kinnera artist Shri Mogulayya



కళాకారులని ప్రోత్సాహిస్తూ కొత్తవారిని కొత్తగా చలనచిత్ర పరిశ్రమకు పరిచయం చేయటంలో పవన్ కల్యాణ్కు కొత్తేమి కాదు కళాకారులని ప్రోత్సాహించటంలో ఆయన ముందు ఉంటారు.

తెలంగాణ రాష్ట్రంలోని నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతానికి చెందిన మొగులయ్య 12 మెట్ల కిన్నెరపై స్వరాలు పలికిస్తూ గానం చేసే అరుదైన కళాకారుడు. వర్తమాన సమాజంలో కనుమరుగవుతున్న ఇలాంటి కళలు, ముఖ్యంగా జానపద కళారూపాలను యువతకు పరిచయం చేయాలనే తపనతో పవన్ కల్యాణ్ తన బీమ్లా నాయక్ చిత్రం ద్వారా తెరపైకి తీసుకువచ్చారు. మొగులయ్య కిన్నెర మీటుతూ పలు జానపద కథలను పాటల రూపంలో వినిపిస్తారు.



జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి దాతృత్వాన్ని చాటుకున్నారు. కళాకారుల ప్రోత్సహించడంలో తనకున్న గొప్ప మనసును మరోసారి రుజువు చేసుకున్నారు. భీమ్లా నాయక్’ను పరిచయం చేసే గీతానికి సాకీ ఆలపిస్తూ కిన్నెర మెట్లపై స్వరాన్ని పలికించిన దర్శనం మొగులయ్యకు రూ.2 లక్షల ఆర్థిక సాయం అందిస్తునట్లు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్ ప్రకటించారు.