Gandhi Jayanti witnessed, YCP leaders indiscriminately attacked Dalits

గాంధీ జయంతి సాక్షిగా వైసీపీ నేతలు దళితులపై విచక్షణారహితంగా దాడి చేశారు.



దళితులపై దాడి చేయడం వైఎస్‌ఆర్‌సిపి నాయకులకు రోజువారీ ప్రక్రియగా మారింది. అధికారంలోకి రావడానికి దళితులు ప్రధాన పాత్ర పోషించారని వైఎస్సార్‌సీపీ మర్చిపోయింది. దళితులపై దాడి చేయడం మరియు దళితులపై ఎస్సీ అట్రాసిటీ కేసు బుక్ చేయడం వైఎస్‌ఆర్‌సిపి నాయకులకు కి పరిపాటిగా మారింది.

శ్రీకాకుళం జిల్లాలో వైసీపీ నేతలు రెచ్చిపోయారు. గాంధీ జయంతి సాక్షిగా దళితులపై దాడి చేశారు. బూర్జ మండలం సుంకరిపేటలో వైసీపీ నేతలు దళితులపై విచక్షణారహితంగా దాడి చేశారు. 

చెరువు స్థలం విషయంలో ఇరు వర్గాల మధ్య గత కొంతకాలంగా వివాదం నడుస్తోంది. ఈరోజు ఉదయం ఇదే విషయంలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో ఒక్కసారిగా వైసీపీ కార్యకర్తలు దళితులపై కర్రలు, రాళ్లతో దాడికి తెగబడ్డారు. 

ఈ ఘటనలో ఐదుగురు దళితులకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని శ్రీకాకుళం జి.జి.హెచ్ కు తరలించారు. అధికార మదం తో వైసీపీ నేతలు దాడికి పాల్పడ్డారని దళిత సంఘాలు మండిపడుతున్నాయి.