#JSPForVizagSteelPlant:- జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బహిరంగ సభకు అన్ని వర్గాల నుండి భారీ మద్దతు
#JSPForVizagSteelPlant:- జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్టీల్ ప్లాంట్ బహిరంగ సభకు అన్ని వర్గాల నుండి భారీ మద్దతు
విశాఖపట్నంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్టీల్ ప్లాంట్ బహిరంగ సభ. వేదికను మార్చాలని పోలీసులు ఉదయం ఆదేశాలు జారీ చేశారు.కానీ జనసేన కార్యకర్తలు రాష్ట్రవ్యాప్తంగా భారీ నిరసనలు చేపట్టారు. ఆ తర్వాత ఎట్టకేలకు కూర్మన్నపాలెం స్టీల్ ప్లాంట్ ఆర్చ్ వద్ద అనుమతి లభించింది.
31వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు జరగనున్న పవన్ కళ్యాణ్ సభ రాజకీయ సమావేశం కాదని జనసేన నేతలు తెలిపారు. ఉత్తరాంధ్ర నేతలతో మరో 2 రోజులు ప్రత్యేక సమావేశాలు.
పవన్ కళ్యాణ్ సభకు అనూహ్య మద్దతు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా బహిరంగ సభ నిర్వహించనున్న పవన్ కళ్యాణ్ అనుబంధ కార్మిక సంస్థ భారతీయ మజ్జూర్ సంఘ్ (బీఎంఎస్), భారతీయ పోర్ట్ , డాక్ మద్దూర్ మహాసంఘ్ మద్దతు పలకడం ఫ్యాక్టరీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
సభకు విచ్చేయు నాయకులు, కార్యకర్తలకు పోలీస్ శాఖ సూచించిన పార్కింగ్ ప్రదేశాలు.

